ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన బిత్తిరి సత్తి

  • ఇటీవల ముదిరాజ్ సభలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బిత్తిరి సత్తి
  • ఆత్మగౌరవ సభల పేరుతో ముదిరాజ్‌లను ఏకం చేస్తున్న ఈటల రాజేందర్
  • ఈ క్రమంలో మంత్రితో బిత్తిరి సత్తి భేటీకి ప్రాధాన్యత
ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీరి కలయిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం పరేడ్ మైదానంలో నిర్వహించిన ముదిరాజ్ సభలో బిత్తిరి సత్తి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కేటీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీ సారాంశం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణలో అరవై లక్షల మంది ముదిరాజ్‌లు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ 119 స్థానాలకు గాను ఒక్క ముదిరాజ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆత్మగౌరవ సభలు, ఆత్మీయ సభల పేరుతో ఈటల రాజేందర్ ముదిరాజ్‌లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తి మంత్రిని కలిశారు.


More Telugu News