తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచింది: నారా భువనేశ్వరి

  • రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల
  • భావోద్వేగానికి గురైన నారా భువనేశ్వరి
  • 53 రోజుల పాటు ఎంతో వేదనకు గురయ్యానని వెల్లడి
  • తెలుగుజాతి ఇచ్చిన మద్దతుతో ఊరట లభించిందని వ్యాఖ్యలు
చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారన్న సమాచారంతో నారా భువనేశ్వరి భావోద్వేగాలకు లోనయ్యారు. ఈ 53 రోజుల పాటు ఎంతో వేదనకు గురయ్యానని తెలిపారు. తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచిందని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట కలిగించిందని చెప్పారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతు ఇచ్చారని వివరించారు. రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని భువనేశ్వరి తెలిపారు. దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు.



More Telugu News