ఫాక్స్‌కాన్ గ్రూప్‌కు లేఖ... స్పందించిన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- యాపిల్ కంపెనీ ప్లాంట్‌ను శివకుమార్ బెంగళూరుకు ఆహ్వానించినట్లు ప్రచారం
- సోషల్ మీడియాలో తన లేఖ అంటూ జరుగుతోన్న ప్రచారం అవాస్తవమన్న శివకుమార్
- అది ఫేక్ లేఖ అంటూ స్పష్టీకరణ
- సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
ఫాక్స్‌కాన్ గ్రూప్‌కు తాను లేఖ రాశానన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా స్పందించారు. యాపిల్ కంపెనీ ప్లాంట్‌ను శివకుమార్ బెంగళూరుకు ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో కేటీఆర్ కూడా విమర్శలు గుప్పించారు. దీంతో శివకుమార్ స్పందించారు. యాపిల్ ఎయిర్‌పాడ్ తయారీ ప్లాంటును హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్ గ్రూపుకు లేఖ రాశానని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న లేఖ నకిలీది అని శివకుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఇది ఫేక్ అంటూ అందుకు సంబంధించిన లేఖలను ట్వీట్ చేశారు.