కడప ఎస్పీని కలిసిన వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి

  • కొన్ని నెలల కిందటే కడప జిల్లా ఎస్పీగా వచ్చిన సిద్ధార్థ్ కౌశల్
  • మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిసిన సునీత, రాజశేఖర్ రెడ్డి
  • వివేకా హత్య కేసు పరిణామాలను ఎస్పీకి వివరించిన వైనం
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నేడు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇటీవలి పరిణామాలను వారు ఎస్పీకి వివరించారు. 

సిద్ధార్థ్ కౌశల్ కొన్ని నెలల కిందటే కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, సునీత, రాజశేఖర్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గురించి, తమ వ్యక్తిగత భద్రత గురించి సునీత, రాజశేఖర్ రెడ్డి ఎస్పీతో మాట్లాడినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న తీరును కూడా వారు ఎస్పీకి వివరించారు.


More Telugu News