పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ వింత రికార్డు

  • వాన కారణంగా నిన్నటి మ్యాచ్‌కు అంతరాయం
  • డక్‌వర్త్ పద్ధతిలో న్యూజిలాండ్‌పై పాక్ గెలిచినట్టుగా నిర్ణయం
  • 400పైగా పరుగులు చేసినా ఓడిన తొలి టీంగా న్యూజిలాండ్ రికార్డు
వరుస పరాజయాల రూపంలో దురదృష్టం వెంటాడుతున్న సమయంలో పాకిస్థాన్‌కు న్యూజిలాండ్ మ్యాచ్‌లో అనూహ్యంగా అదృష్టం వరించింది. న్యూజిలాండ్ టీం ఏకంగా 401 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పాక్‌ను విజయం వరించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాక్ తన సెమీస్ మ్యాచ్‌లను సజీవంగా ఉంచుకోగలిగింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఓ వింత రికార్డు మూటగట్టుకుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లో నాలుగు వందలకు పైగా పరుగులు చేసి కూడా ఒడిన తొలి దేశంగా న్యూజిలాండ్ చరిత్ర పుటల్లోకెక్కింది. డక్‌వర్త్ పద్ధతిలో పాక్ స్కోరు 200/1గా నిర్ణయం కాగా ప్రత్యర్థిపై 21 పరుగుల తేడాతో గెలుపొందింది.


More Telugu News