విమర్శల వర్షం కురుస్తున్నా తగ్గని బంగ్లా కెప్టెన్.. టైమ్‌డ్ అవుట్ నిర్ణయాన్ని సమర్థించుకున్న షకీబల్

  • అప్పీలుపై తనలో పశ్చాత్తాపం లేదన్న షకీబల్ హసన్
  • రూల్స్‌లో ఉంది కాబట్టే చేశానని సమర్థన
  • జట్టు ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ
శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మ్యాథ్యూస్‌ను టైమ్‌డ్ అవుట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ మాత్రం ఏమాత్రం చింతించడం లేదు. టైమ్‌డ్ అవుట్‌పై అప్పీలు చేసినందుకు తానేమీ పశ్చాత్తాపం పడడం లేదని తేల్చి చెప్పాడు. ఫీల్డర్లలో ఒకరు వచ్చి అప్పీల్ చేస్తే మ్యాథ్యూస్ అవుటవుతాడని చెప్పాడని, అదే చేశానని పేర్కొన్నాడు. 

తన అప్పీలుకు అంపైర్లు సీరియస్‌గానే చేస్తున్నావా? అని అడిగితే అవునని అన్నానని పేర్కొన్నాడు. అది తప్పా? ఒప్పా? అనేది పక్కన పెడితే రూల్స్‌లో ఉంది కాబట్టే అప్పీల్ చేశానని చెప్పుకొచ్చాడు. జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా తాను సిద్ధంగా ఉంటానని, ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోనని తేల్చి చెప్పాడు. మ్యాథ్యూస్‌తో వాగ్వివాదం కూడా తమ గెలుపునకు కలిసొచ్చిందని వివరించాడు.


More Telugu News