ఒక కప్పు... ఇద్దరు కెప్టెన్లు... చారిత్రక ప్రదేశంలో ఫొటోషూట్

  • వరల్డ్ కప్ ఫైనల్ కు సర్వం సిద్ధం
  • రేపు అహ్మదాబాద్ లో టీమిండియా × ఆస్ట్రేలియా
  • అదాలజ్ మెట్ల బావి వద్ద కప్పుతో ఫొటోలకు పోజులిచ్చిన రోహిత్, కమిన్స్
వరల్డ్ కప్ ఫైనల్ కు సర్వం సిద్ధమైంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు రేపు (నవంబరు 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కప్ కోసం కత్తులు దూయనున్నాయి! ఈ నేపథ్యంలో, వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ లకు ఫొటో షూట్ నిర్వహించారు. అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఈ ఫొటో షూట్ జరిపారు. దిగ్గజ క్రికెటర్ల రాకతో వారిని చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. దాంతో అక్కడ కోలాహలం నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకున్నాయి.


More Telugu News