డ్రైనేజీలోకి దిగిన బిల్ గేట్స్... ఎందుకంటే...!
- నవంబరు 19న వరల్డ్ టాయిలెట్ డే
- బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో పర్యటించిన బిల్ గేట్స్
- అండర్ గ్రౌండ్ మ్యూజియంను సందర్శించానని వెల్లడి
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, కుబేరుడు బిల్ గేట్స్ గతంలో మలాన్ని శుద్ధి చేసి తయారు చేసిన నీటిని తాగి సంచలనం సృష్టించారు. తాజాగా ఆయన ఓ డ్రైనేజీలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిల్ గేట్స్ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సీవర్ (మురుగునీరు) మ్యూజియంను సందర్శించారు. అందులో భాగంగానే ఆయన మ్యాన్ హోల్ తెరిచి డ్రైనేజీలోకి దిగారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
బ్రస్సెల్స్ లోని ఈ సీవర్ మ్యూజియంను భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో బిల్ గేట్స్ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. వరల్డ్ టాయిలెట్ డే (నవంబరు 19) సందర్భంగా బ్రస్సెల్స్ లోని అండర్ గ్రౌండ్ మ్యూజియంకు వెళ్లి అనేక విషయాలు తెలుసుకున్నానని వివరించారు.
1800 సంవత్సరంలో బ్రస్సెల్స్ పరిస్థితికి, ఇప్పటికీ ఊహించనంత తేడా ఉందని తెలిపారు. నాడు నగరంలోని మురుగు నీటిని స్థానిక సెన్నే నదిలోకి విడుదల చేసేవారని, తద్వారా కలరా మహమ్మారి విజృంభించిందని వెల్లడించారు. ప్రస్తుతం బ్రస్సెల్స్ నగరంలో 200 మైళ్ల మురుగునీటి మేనేజ్ మెంట్ వ్యవస్థ ఉందని, డ్రైనేజ్ నెట్ వర్క్, ట్రీట్ మెంట్ ప్లాంట్లు వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంటాయని వివరించారు.