టెక్సాస్ షాపింగ్ మాల్ ముందు కూలిన విమానం.. వీడియో ఇదిగో!
- మంగళవారం పార్కింగ్ సెంటర్ లో కుప్పకూలిన చిన్న విమానం
- మంటలు ఎగసిపడి పలు వాహనాల దగ్ధం
- మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న చిన్న విమానం ఒకటి సడెన్ గా కూలిపోయింది. ప్లానోలోని ఓ షాపింగ్ సెంటర్ పార్కింగ్ లో ఇది పడింది. దీంతో మంటలు ఎగసిపడి విమానంతో పాటు పలు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. పైలట్ ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని అధికారులు తెలిపారు.
కుప్పకూలిన విమానం సింగిల్ ఇంజిన్ మూని ఎం 20 ప్లేన్ అని అధికారులు వెల్లడించారు. విమానం క్రాష్ ల్యాండ్ కావడానికి కారణమేంటనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో పైలట్ తో పాటు ఎవరైనా ఉన్నారా.. ప్లేన్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళుతోందనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు వివరించారు.