కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయం: కేటీఆర్

  • డిసెంబర్ 3 తర్వాత కొత్త పథకాలను ప్రారంభిస్తామన్న కేటీఆర్
  • రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని వెల్లడి
  • కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని ప్రశ్న
డిసెంబర్ 3వ తేదీ తర్వాత కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని, జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పారు. అసైన్డ్ భూములు ఉండే వారికి భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని తెలిపారు. 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అనవసరంగా కరెంట్ ఇస్తున్నారని రేవంత్ అంటున్నారని విమర్శించారు. కరెంట్ ఎక్కడ వస్తోందని అంటున్నారని... కరెంట్ తీగలు గట్టిగా పట్టుకుంటే రాష్ట్రానికి ఓ దరిద్రం పోతుందని అన్నారు. కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని... కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో వార్తలను నమ్మొద్దని సూచించారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని అన్నారు.


More Telugu News