మావోయిస్టుల లేఖలతో ఉమ్మడి అదిలాబాద్ లో కలకలం
- ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ వెలసిన పోస్టర్లు
- సికాసా ప్రభాత్ పేరుతో ఎమ్మెల్యేలకు బెదిరింపులు
- దుర్గం చిన్నయ్య భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపణ
భూకబ్జాలు, మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారంటూ పలువురు ప్రజాప్రతినిధులకు మావోయిస్టులు హెచ్చరికలు చేశారు. ఈమేరకు సికాసా ప్రభాత్ పేరుతో పోస్టర్లు వెలవడం నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కలకలం సృష్టించింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని, ఆయన అనుచరులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని లేఖలో హెచ్చరించారు. ఎమ్మెల్యే సాయం కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారని మావోయిస్టులు అందులో పేర్కొన్నారు.
మరో ఎమ్మెల్యే దివాకర్ రావు అనుచరుడు, హాజీపూర్ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఈ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలోని యువతను డ్రగ్స్ కు బానిసలుగా మార్చుతున్నాడంటూ మావోయిస్టులు దివాకర్ రావు కొడుకు విజిత్ రావుపై మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీకి వచ్చే నిధుల దారి మళ్లింపులో, విద్యార్థుల దీన స్థితికి కారణం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లేనని మావోయిస్టులు ఆరోపించారు. ఇందులో ఖానాపూర్, నిర్మల్, ముధోల్, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను ఈ లేఖలో మావోయిస్టులు టార్గెట్ చేయడం ప్రస్తుతం కలకలంగా మారింది. అయితే, ఈ లేఖలను మావోయిస్టులే విడుదల చేశారా? లేక గిట్టని వారు చేసిన పనా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.