ఇక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణం: అమిత్ షా

  • డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి అన్న అమిత్ షా
  • బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్లేనని హెచ్చరిక
  • బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసిందని వెల్లడి
  • బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఘనత తమ పార్టీదే అన్న అమిత్ షా
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి అని, అలాగే దేశంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ గెలిస్తే దేశానికి భద్రత మరింతగా సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పటాన్‌చెరులో సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ వేలకోట్లు దోచుకున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ పార్టీ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి చెందిన ఓవైసీకి ఓటేసినట్లు అవుతుందన్నారు. బీజేపీ గెలిచాక తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి రాజ్యమేలుతోందని, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతోందని, కశ్మీర్‌ను కాపాడుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఘనత బీజేపీదే అన్నారు. బీజేపీని గెలిపిస్తే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. కేసీఆర్ వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు.


More Telugu News