కొడుకు ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా
- ముఖం కనిపించకుండా ఫొటో పోస్ట్ చేసిన స్టార్ పేసర్
- ‘మై లిటిల్ సన్‌షైన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన బుమ్రా
- ‘ మై ఫేవరెట్ బాయ్స్’ అంటూ స్పందించిన భార్య సంజనా గణేశన్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది సెప్టెంబర్ 4న తండ్రి అయ్యాడు. అతడి భార్య, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా తన నవజాత కొడుకు ఫొటోని బుమ్రా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ‘‘ మై లిటిల్ సన్‌షైన్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఫొటోలో శిశువు ముఖం కనిపించకుండా సూర్యుడి ఎమోజీతో కవర్ చేశాడు. కొడుకుని చేతుల్లోకి తీసుకొని బుమ్రా మురిసిపోతూ కనిపించాడు. ఈ ఫొటో ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించి అభినందనలు తెలియజేశారు. అయితే ఈ పోస్టుపై బుమ్రా భార్య సంజనా గణేశన్ కూడా ఆసక్తికరంగా స్పందించింది. ‘మై ఫేవరెట్ బాయ్స్’’ అని కామెంట్ పెట్టింది. దీనికి ‘హార్ట్ ఎమోజీ’ని జోడించింది. దీంతో బుమ్రా పోస్ట్ మరింత వైరల్‌గా మారింది.
కాగా బుమ్రా భార్య సంజన ఈ ఏడాది సెప్టెంబర్ 4న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బుమ్రా ప్రకటించాడు. పిల్లాడి పేరు ‘అంగద్’అని తెలిపాడు. ‘‘ మా చిన్న కుటుంబం కొంచెం పెద్దదైంది. మేము ఎప్పుడూ ఊహించనంతగా మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి!. ఈ రోజు ఉదయం మా పిల్లాడు ‘అంగద్’ని ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికాం’’ అని బుమ్రా వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడిన టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడంతో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.