హుజూరాబాద్‌లో ట్రైలర్ చూపించాం.. ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తాం: ప్రధాని మోదీ
- తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని ధీమా
- అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ
- కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుని ప్రతి అడుగులో అవమానించిందని ఆగ్రహం
హుజూరాబాద్ ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్‌కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆట ముగియనుందని జోస్యం చెప్పారు. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుని ప్రతి అడుగులో అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు... ఆ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు అవసరం లేదన్నారు. గ్యారెంటీలను నెరవేర్చే మోదీ సర్కార్ తెలంగాణకు అవసరమన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం... మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఆరోగ్యం... మోదీ గ్యారెంటీ అంటే రైతులకు చేయూత అన్నారు. బీజేపీ ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ఓ వైపు ప్రజలను మోసం చేసిన కేసీఆర్... మరోవైపు మీ సేవకుడు మోదీ ఉన్నారని, తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.