టీ20 వరల్డ్ కప్-2024 ఫార్మాట్ ఎలా ఉంటుందంటే...!
- వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్
- అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యం
- ఈసారి టోర్నీలో 20 జట్లు
- త్వరలోనే షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా దేశాల్లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లపై స్పష్టత వచ్చింది. క్వాలిఫయింగ్ టోర్నీలన్నీ ముగిసిన అనంతరం... మొత్తం 20 జట్లతో జాబితాను ఐసీసీ విడుదల చేసింది.
ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు టీ20 వరల్డ్ కప్ కు నేరుగా క్వాలిఫై కాగా... మెరుగైన ర్యాంకింగ్స్ ఆధారంగా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు అవకాశం దక్కించుకున్నాయి.
అమెరికాస్ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి కెనడా... ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి నేపాల్, ఒమన్... తూర్పు ఆసియా-పసిఫిక్ దేశాల క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి పాపువా న్యూ గినియా... యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఐర్లాండ్, స్కాట్లాండ్... ఆఫ్రికా క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి నమీబియా, ఉగాండా దేశాలు టోర్నీకి అర్హత సాధించాయి.
ఈసారి పెద్ద సంఖ్యలో టీమ్ లు ఆడుతుండడంతో టోర్నీ ఫార్మాట్ ఎలా ఉంటుందన్న దానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
టోర్నీ ఫార్మాట్ వివరాలు...
కాగా, టోర్నీ షెడ్యూల్, తేదీలను ఐసీసీ త్వరలోనే విడుదల చేయనుంది. 2024 జూన్ లో ఈ టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి.

- ఈసారి టీ20 వరల్డ్ కప్ లో ఆడే మొత్తం జట్ల సంఖ్య... 20
- ఈ జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి
- ఈ నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి
- ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు
- ఈ సూపర్-8 దశలో ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి.
- ఇలా సెమీఫైనల్స్ కు చేరే నాలుగు జట్ల నుంచి రెండు టీమ్ లు ఫైనల్ లో అడుగుపెడతాయి.