విడుదలవుతున్న లీడ్స్.. నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఎవరంటే?

  • మధ్యప్రదేశ్‌లో బీజేపీ..రాజస్థాన్‌లో కాంగ్రెస్ లీడింగ్
  • తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్
  • చత్తీస్‌గఢ్‌లోనూ లీడ్స్‌లో కాంగ్రెస్‌దే హవా
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో లీడ్స్ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 33, కాంగ్రెస్ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఎస్పీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ 41, బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌‌లో కాంగ్రెస్ 26, బీజేపీ 21, తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ 24, బీఆర్ఎస్12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.


More Telugu News