తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక.. వీడియో ఇదిగో

  • ఎయిర్ పోర్ట్ వద్ద సోనియా, రాహుల్ ప్రియాంకలకు స్వాగతం పలికిన రేవంత్
  • అక్కడి నుంచి భారీ భద్రత మధ్య తాజ్ కృష్ణకు చేరుకున్న కాంగ్రెస్ పెద్దలు
  • వీహెచ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సోనియా, రాహుల్
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం కాంగ్రెస్ అగ్రనేతలంతా వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలకు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, తెలంగాణ ఇన్ఛార్జీ మాణిక్ రావు ఠాక్రేలు స్వాగతం పలికారు. అనంతరం భారీ భద్రత మధ్య వీరు తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. ముగ్గురు అగ్రనేతలకు తాజ్ కృష్ణ వద్ద కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. సోనియాకు సీనియర్ నేత వి.హనుమంతరావు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వీహెచ్ యోగక్షేమాలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం సీఎంగా రేవంత్, మంత్రులుగా పలువురు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.


More Telugu News