మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
- ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాకుండా 11 మంది మంత్రులు
- మరో ఆరుగురికి ఇచ్చే అంశంపై చర్చ
- ఈ రోజే హైదరాబాదుకు తిరిగి రానున్న సీఎం
మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ముఖ్యంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది శాఖలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. పదకొండు మంది మంత్రుల శాఖలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజు ఢిల్లీకి చేరుకొని, మంత్రివర్గ కూర్పుపై చర్చించి, తిరిగి ఈ రోజే హైదరాబాద్ చేరుకుంటారు. కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది. రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు 12 మంది కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఆరుగురికి ఎవరికి ఇవ్వాలి? అనే అంశంపై కూడా చర్చించనున్నారు. ఆరు బెర్తులకు పలువురు రేసులో ఉన్నారు.