గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అసంతృప్తి
- గవర్నర్ ప్రసంగం పట్ల ప్రజలంతా బాధపడ్డారన్న కవిత
- రెండుసార్లు ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వంపై విమర్శలు చేశారని మండిపాటు
- అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం పట్ల ప్రజలంతా బాధపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ... ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై చర్చ జరిగిందని వ్యాఖ్యానించారు.
రెండుసార్లు ప్రజల ఓటుతో గెలిచిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరినట్లు చెప్పారు.
తాము తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కవిత తెలిపారు. ఇవి శాసనమండలి తొలి సమావేశాలు అని, మండలిలో బీఆర్ఎస్‌కు మెజార్టీ ఉందని గుర్తించాలన్నారు. అయితే ప్రజలకు సహకరించాలన్న ఉద్దేశంతో తాము ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రగతిపై రోడ్డు మ్యాప్ ద్వారా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నష్టం జరిగే చర్యలను అడ్డుకుంటామని, అవసరమైతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.