తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం

  • 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
  • రోడ్డు భద్రతా విభాగం చైర్మన్‌గా అంజనీకుమార్ నియామకం
  • ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా అదనపు బాధ్యతల అప్పగింత
డీజీపీ రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల డీజీపీగా నియమితులైన రవిగుప్తాకు ప్రభుత్వం ఇప్పుడు డీజీపీగా పూర్తి బాధ్యతలు అప్పగించింది. రోడ్డు భద్రతా విభాగం చైర్మన్‌గా అంజనీకుమార్‌ను నియమించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్యమిశ్ర, సీఐడీ డీఐజీగా రమేశ్ నాయుడు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సంయుక్త కమిషనర్‌గా సత్యనారాయణ, మధ్య మండల డీసీపీగా శరత్ చంద్ర పవార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి, టీసీపీఎఫ్ అడిషనల్ డీజీగా అనిల్ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్ రెడ్డిలను నియమించారు.

ఇక, హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ-2గా తరుణ్ జోషిని నియమించిన ప్రభుత్వం... మల్టీ జోన్-1 ఐజీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఐడీ అడిషనల్ డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. వీరికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది.


More Telugu News