స్టేజ్ ఎక్కుతూ కిందపడిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్
- జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అథితిగా గవర్నర్
- మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కిందపడిన తమిళసై
- భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదిక పైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగలలేదు. వెంటనే గవర్నర్ వెనుక ఉన్న భద్రతా సిబ్బంది స్పందించి, గవర్నర్‌ను పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.