రోహిత్ శర్మ తన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి: సునీల్ గవాస్కర్

  • రేపటి నుంచి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్
  • వరల్డ్ కప్ తర్వాత తొలి టెస్ట్ ఆడుతున్న రోహిత్
  • టెస్టులకు అనుగుణంగా రోహిత్ మానసికంగా మారాలన్న గవాస్కర్
రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. రెండు టెస్ట్ ల ఈ సిరీస్ కు టీమిండియా పూర్తి స్థాయిలో రెడీ అయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ ఫైనల్స్ తర్వాత రోహిత్ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న రోహిత్ తన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలని గవాస్కర్ చెప్పారు. వన్డే ఫార్మాట్ నుంచి టెస్ట్ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా రోహిత్ మానసికంగా మారాలని తెలిపారు. వరల్డ్ కప్ లో తొలి 10 ఓవర్లలో భారీ స్కోరు చేసే విధంగా రోహిత్ ఆడాడని... ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో రోజంతా ఆడే విధంగా చూసుకోవాలని సలహా ఇచ్చారు. 


More Telugu News