జైల్లో ఉన్న ఆ ఐదుగురు నా హీరోలే: కేజ్రీవాల్

  • ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆప్ రాజకీయాలు చేస్తుందన్న కేజ్రీవాల్
  • జైలుకు వెళ్లేందుకు కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు
  • ఇతర పార్టీలు పట్టించుకోని విషయాలను ఆప్ పట్టించుకుందని వ్యాఖ్య
ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజా సంక్షేమమే ముఖ్యమని, ఇదే లక్ష్యంతో రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు తాము ఎంచుకున్న మార్గం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామని, జైలుకు వెళ్లేందుకైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మద్యం కుంభకోణం ఆరోపణలతో ఐదుగురు ఆప్ నేతలు జైల్లో ఉన్నందుకు చాలా గర్విస్తున్నానని చెప్పారు.  పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

జైల్లో ఉన్న తమ ఐదుగురు నాయకులూ తన హీరోలే అని కేజ్రీవాల్ చెప్పారు. ఇతర పార్టీలు పట్టించుకోని విషయాలను పట్టించుకున్నందుకే ఆప్ ఎదిగిందని అన్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ నెల 3న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపించింది. గతంలో కూడా రెండు సార్లు ఈడీ సమన్లు పంపించింది. అయితే, ఆయన విచారణకు హాజరుకాలేదు.


More Telugu News