వాణిజ్య నౌక హైజాక్.. బందీలను కాపాడిన భారత నేవీ
- సోమాలియా తీరంలో గురువారం వాణిజ్య నౌక ఎంవీ లీల నార్ఫోక్ హైజాక్
- సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి భారత నేవీ
- వాణిజ్య నౌకను చుట్టుముట్టిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నై
- నౌకలోకి ప్రవేశించిన నేవీ మార్కోస్ కమాండోలను చూసి హైజాకర్ల పరార్
- 15 మంది భారతీయులు సహా మొత్తం 21 మంది సిబ్బందిని కాపాడిన ఇండియన్ నేవీ
అరేబియా సముద్రంలో సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్‌కు గురైన వాణిజ్య నౌక ‘ఎంవీ లీల నార్ఫోక్’ను భారతీయ నావికా దళం కాపాడింది. నౌకలోని హైజాకర్లను తరిమేసి 15 మంది భారతీయులు సహా మొత్తం 21 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. గురువారం సాయంత్రం ఈ నౌక హైజాక్‌కు గురైంది. సుమారు ఆరుగురు సముద్రపు దొంగలు ఆయుధాలతో నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేశారు. వెంటనే నౌకలోని సిబ్బంది తమను కాపాడాలంటూ ఎమర్జెన్సీ సందేశాన్ని పంపించారు.
సమాచారం అందుకున్న వెంటనే భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నైతో పాటూ గస్తీ విమానాలు, హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. వాణిజ్య నౌకను ఐఎన్ఎస్ చెన్నై చుట్టుముట్టి హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో మార్కోస్ కమాండోల బృందం నౌకలోకి ప్రవేశించింది. దీంతో, బెదిరిపోయిన హైజాకర్లు నౌకను వదలి పారిపోయారు. నౌకలో హైజాకర్లు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక నేవీ కమాండోలు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం, రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు నేవీ ఓ ప్రకటన విడుదల చేసింది.