ఆట సూస్తావా .. : 'గుంటూరు కారం' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్!

  • త్రివిక్రమ్ రూపొందించిన 'గుంటూరు కారం'
  • మాస్ లుక్ మార్కులు కొట్టేసిన మహేశ్ 
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా బలమైన తారాగణం 
  • ఈ నెల 12వ తేదీన సినిమా రిలీజ్     

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో 'గుంటూరు కారం' సినిమా రూపొందింది. హారిక - హాసిని బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. మాస్ హీరోగా ఇంతవరకూ మహేశ్ బాబు చేసిన సినిమాలు ఒక లెక్క .. ఈ సినిమా ఒక లెక్క అన్నట్టుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో ఆయనను చూపించనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. మహేశ్ బాబు పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మహేశ్ బాబు సింపుల్ డైలాగ్స్ .. 'ఆట సూస్తావా' అనే  ఆయన మేనరిజం .. పండు మిరపకాయలు ఆరబోసిన ప్లేస్ లో జరిగే ఫైట్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

మొత్తం మీద ఈ ట్రైలర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాలనే టీమ్ ప్రయత్నం ఫలించేలానే కనిపిస్తోంది. జగపతిబాబు ... ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. రమ్యకృష్ణ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసమే మహేశ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 


More Telugu News