సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు... హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
- ఖమ్మంలోని తన నివాసంలో వుండగా గుండెపోటు
- ప్రయివేటు ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలింపు
- నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం తమ్మినేనిని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తమ్మినేని రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనలలో పాల్గొంటున్నారు. తనకు నలతగా ఉందని నిన్న సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.