'గుంటూరు కారం' సినిమాలో తాను కాల్చిన బీడీ దేనితో తయారైందో చెప్పిన మహేశ్ బాబు

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం
  • జనవరి 12న సంక్రాంతికి రిలీజైన సినిమా 
  • రెండ్రోజుల్లోనే రూ.127 కోట్ల గ్రాస్ వసూలు
  • సినిమాలో ఎక్కువగా బీడీలు తాగుతూ కనిపించిన మహేశ్ బాబు
  • ఇదే అంశాన్ని ప్రస్తావించిన యాంకర్ సుమ
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతి బరిలో రిలీజైన 'గుంటూరు కారం' చిత్రం మిక్స్ డ్ టాక్ తో రన్ అవుతోంది. రెండ్రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ తో మహేశ్ స్టామినా నిరూపితమైంది. 

'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు ఎక్కువగా బీడీలు తాగుతూ కనిపిస్తాడు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ ఇదే విషయాన్ని మహేశ్ వద్ద ప్రస్తావించింది. అందుకాయన ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 'గుంటూరు కారం' చిత్రంలో తాను తాగింది ఒరిజినల్ బీడీ కాదని తెలిపారు. 

షూటింగ్ మొదట్లో ఒకసారి ఒరిజినల్ బీడీ తాగానని, దాంతో మైగ్రేన్ తలనొప్పి వచ్చినంత పనైందని అన్నారు. బీడీలు తాగడం నా వల్ల కావడంలేదు అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెప్పానని వెల్లడించారు. ఆ తర్వాత ఆయుర్వేదిక్ బీడీ అని సెట్లో వాళ్లు ఒక బీడీ తీసుకువచ్చారని, అది లవంగం ఆకులతో తయారుచేసిన బీడీ అని వివరించారు. 

అది తాగితే ఎంతో బాగుండడంతో, దాన్నే సినిమాలో కంటిన్యూ చేశామని తెలిపారు. ఆ బీడీ మింట్ ఫ్లేవర్ లో ఉందని, అందులో ఎలాంటి పొగాకు సంబంధిత పదార్థాలు లేవని, అది పక్కా ఆయుర్వేదిక్ అని మహేశ్ బాబు స్పష్టం చేశారు. వాస్తవానికి తాను పొగ తాగనని, పొగ తాగడాన్ని ప్రోత్సహించనని చెప్పారు.


More Telugu News