కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్‌ను విచారించిన ఈడీ

  • విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడి
  • ఈ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ
  • ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ బోగస్ సంస్థ అని గుర్తించిన ఈడీ
విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది.

ఈ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతోంది. ఈ విషయమై నేడు వివేక్‌ను ప్రశ్నించింది. గత ఏడాది నవంబర్ నెలలో విశాఖ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి కోట్లాది రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.


More Telugu News