అండర్-19 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ పై ఓ మోస్తరు స్కోరు చేసిన భారత కుర్రాళ్లు
- దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
- జనవరి 19న ప్రారంభం
- నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసిన భారత్
దక్షిణాఫ్రికాలో జనవరి 19 నుంచి అండర్-19 వరల్డ్ కప్ జరుగుతోంది. ఇవాళ భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. బ్లూంఫోంటీన్ లో జరుగుతున్న ఈ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (76), కెప్టెన్ ఉదయ్ సహారన్ (64) అర్ధసెంచరీలతో మెరిశారు. ప్రియాన్షు మోలియా 23, తెలుగుతేజం ఆరవెల్లి అవనీశ్ రావు 23, సచిన్ దాస్ 26 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలర్ మారుఫ్ మ్రిధా 5 వికెట్లు తీశాడు.