'పద్మ విభూషణ్'కు వీరిద్దరూ అర్హులే: విజయసాయిరెడ్డి

  • 'పద్మ' పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
  • వెంకయ్యనాయుడు, చిరంజీవికి 'పద్మ విభూషణ్'
  • ఇద్దరికీ అభినందనలు తెలిపిన విజయసాయిరెడ్డి
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 

"పద్మ విభూషణ్ అందుకోబోతున్న వెంకయ్యనాయుడు గారికి, చిరంజీవి గారికి అభినందనలు. ప్రజా వ్యవహారాల్లో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారు. చిరంజీవి గారు కళా రంగానికి విశిష్ట సేవలందించారు. వీరిద్దరూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పద్మ విభూషణ్ వంటి గొప్ప అవార్డుకు వీరిద్దరూ అర్హులే. తెలుగు ప్రజలు గర్వించే క్షణాలివి" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.


More Telugu News