కోడికత్తి దాడి వెనక ఓ పనికిమాలిన మంత్రి ఉన్నారు.. శ్రీను ప్రాణాలు తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
- జగన్ తన స్వార్థం కోసం శ్రీనును ఐదేళ్లుగా జైలులో ఉంచారన్న కేంద్ర మాజీ మంత్రి
- ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గాలు సమంజసం కాదని హితవు
- శ్రీనును విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి వెనక ఓ పనికిమాలిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను ప్రాణాలను రేపోమాపో తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, వైసీపీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. తిరుపతిలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
విమానాశ్రయంలోకి కత్తి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడున్న భద్రతాధికారులతో తాను మాట్లాడానని, అప్పుడు కత్తి లేదని, జగన్‌కు రక్తం కూడా రాలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గాలకు దిగడం సరికాదని హితవు పలికారు. జగన్ తన స్వలాభం కోసం దళితుడైన శ్రీనును ఐదేళ్లుగా జైలులో ఉంచడం దళిత ద్రోహానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనును వెంటనే విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.