మంగళగిరి ప్రీమియర్ లీగ్-2 విజేత వల్లభనేని వెంకట్రావు యూత్... ఫైనల్ మ్యాచ్ తిలకించిన నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

  • మంగళగిరిలో 100 జట్లతో క్రికెట్ టోర్నీ
  • 20 రోజుల పాటు క్రికెట్ వినోదాన్ని అందించిన ఎంపీఎల్ 
  • నేడు ఫైనల్
  • హాజరైన టీడీపీ అగ్రనేతలు
  • విజేతగా నిలిచిన జట్టుకు రూ.2 లక్షల ప్రైజ్ మనీ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని నారా లోకేశ్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో  మంగళగిరి ప్రీమియర్ లీగ్ -2 క్రికెట్ పోటీలు నిర్వహించారు. తాడేపల్లికి చెందిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచింది. ఈ మధ్యాహ్నం వల్లభనేని వెంకట్రావు యూత్ వర్సెస్ అన్‌స్టాపబుల్ జట్ల మధ్య ఉత్కంఠ బరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు గెలుపొందింది. 

నియోజకవర్గ నాయకులు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకోగా, జాతీయ గీతాలాపనతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇతర మఖ్య అతిథులతో కలిసి వీక్షించారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టోర్నీలో పాల్గొన్న వందలాది మంది క్రీడాకారులు, అభిమానులతో నారా లోకేశ్ ఫోటోలు దిగారు. అంతేకాదు, క్రికెట్ బ్యాట్  చేతబట్టి కాసేపు బ్యాటింగ్  కూడా చేసి అందరినీ అలరించారు. 

విజేతకు రూ.2 లక్షల ప్రైజ్ మనీ

ఎంపీఎల్ విజేతగా నిలిచిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టుకు నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి సహకారంతో రూ.2 లక్షల ప్రైజ్ మనీ అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన అన్‌స్టాపబుల్ క్రికెటర్స్ జట్టుకు సీనియర్ నాయకులు ఇట్టా పెంచలయ్య సహకారంతో రూ.లక్ష, తృతీయ స్థానంలో నిలిచిన డీజే 2023 జట్టుకు యర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ సహకారంతో రూ.50 వేల నగదు బహుమతులు అందించారు. 

టోర్నీలో పాల్గొన్న 100 జట్లకు నారా లోకేశ్ సహకారంతో టీడీపీ, జనసేన నేతలు క్రికెట్ కిట్లు అందజేశారు. 20 రోజుల పాటు నిరంతరాయంగా క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన నియోజకవర్గ తెలుగు యువతను, నియోజకవర్గ నాయకులను నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. 

లోకేశ్ విజయానికి కృషి చేస్తామన్న క్రీడాకారులు

ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ... నియోజకవర్గ స్థాయిలో రూ.2 లక్షలు, రూ.1 లక్ష, రూ. 50 వేల ఫ్రైజ్‌మనీతో అద్భుతంగా క్రికెట్ పోటీలను నిర్వంచడం అభినందనీయం అన్నారు. నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వాలీబాల్ కిట్స్, క్రికెట్ కిట్స్ అందించడంతో పాటు విశాలవంతమైన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ఆకట్టుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో నారా లోకేశ్ ను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

ఫైనల్ మ్యాచ్ కు హాజరైన టీడీపీ అగ్రనేతలు

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పి గన్నవరం నియోజకవర్గ టూమెన్ కమిటీ కన్వీనర్ గంటి హరీశ్ మాధుర్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులు యం.ఎస్ బేగ్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతినేని శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


More Telugu News