బడ్జెట్ నిరాశాజనకం... ప్రసంగమంతా సొంత డబ్బాలా ఉంది: బీఆర్ఎస్ ఎంపీల విమర్శలు
- అది చేశాం... ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నమని విమర్శ
- తెలంగాణకు బడ్జెట్‌లో మొండిచేయి చూపించారని విమర్శ
- నిర్మలా సీతారామన్ ప్రసంగం రాజకీయ ప్రసంగాన్ని తలపించిందని వ్యాఖ్య
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు స్పందించారు. ఈ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. బడ్జెట్ ప్రసంగమంతా సొంత డబ్బాలాగా ఉందని విమర్శించారు. అది చేశాం... ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం తప్ప ఏమీ లేదన్నారు.
తెలంగాణకు ఎప్పటిలాగే మొండిచేయి చూపించారని విమర్శించారు. విభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం మాత్రమే బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నారని ఆరోపించారు. దేశ ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయారన్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి ప్రసంగం రాజకీయ ప్రసంగాన్ని తలపించిందన్నారు. మధ్యంతర బడ్జెట్ ఏ వర్గాన్నీ సంతృప్తిపరచలేకపోయిందన్నారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం బడ్జెట్‌లో ప్రస్తవించలేదని విమర్శించారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగ నిర్మూలనకు ఏం చేస్తారో చెప్పలేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ప్రణాళికలు లేవన్నారు. రైతులకు... వ్యవసాయానికి ఏమాత్రం బడ్జెట్‌లో ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. సామాన్యులకు, ఉద్యోగులకు ఎలాంటి ఊరట దక్కలేదని ఆరోపించారు. అయుష్మాన్ భారత్ పథకం కింద అందించే కవరేజ్ రూ.10 లక్షలకు పెంచుతారని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైందన్నారు.