మంగళగిరి చేనేత చీరలో అమ్మ మరింత అందంగా ఉంది కదూ!: నారా లోకేశ్

  • నేడు మంగళగిరి నియోజకవర్గంలో  నిజం గెలవాలి యాత్ర
  • గన్నవరం ఎయిర్ పోర్టులో నారా భువనేశ్వరికి ఘనస్వాగతం
  • మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామం నుంచి పర్యటన ప్రారంభం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు మంగళగిరి నియోజకవర్గంలో 'నిజం గెలవాలి' పర్యటనలో పాల్గొనేందుకు విచ్చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఆమెకు టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రను దుగ్గిరాల గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. 

ఈ సందర్భంగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. తల్లి భువనేశ్వరి తన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తుండడం పట్ల లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. 

మంగళగిరి చేనేత చీరలో అమ్మ మరింత అందంగా ఉంది కదూ అంటూ ట్వీట్ చేశారు. ఒక్కో పోగు జత చేసి అద్భుతాన్ని సృష్టించే మంగళగిరి చేనేత కళాకారులకు హ్యాట్సాఫ్ అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.


More Telugu News