ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి ఇస్తాం: జనసేన అధినేత పవన్ కల్యాణ్
- తన సంపాదన ప్రజలకు పంచిపెట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్న జనసేనాని
- జనసేన-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తామని వ్యాఖ్య
- ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలను తొలగించబోమని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్
సీఎం జగన్ ఏనాడూ తన జేబు నుంచి ఒక్కరూపాయి కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. తాను జగన్‌లా కాదని, తన సంపాదన ప్రజలకు పంచిపెట్టేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తామని అన్నారు. రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి ఇస్తామే తప్ప ప్రస్తుత స్కీములను రద్దు చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ మరో దఫా చెక్కులు పంపిణీ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు ఉమ్మడి నిధి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సమస్యల పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 226 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామని, పవన్ సొంత నిధుల నుంచి రూ.3.5 కోట్లు అందజేశారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.