మేనేజ్‌మెంట్ కోటా అంటుంటాను... అది మొదటిసారి గెలిచేందుకే ఉపయోగపడుతుంది: రేవంత్ రెడ్డి
- రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి
- సమస్యల పరిష్కారంలో శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారన్న ముఖ్యమంత్రి
- మేనేజ్‌మెంట్ కోటాలో గెలిచినా ఆ తర్వాత సత్తా ఉంటేనే రాణించగలమని వ్యాఖ్య
- శ్రీధర్ బాబు తండ్రి వారసత్వాన్ని తీసుకొని స్వయంకృషితో ఎదిగారన్న సీఎం
తాను కొందరిని మేనేజ్‌మెంట్ కోటా అని అంటుంటానని, కానీ అలాంటి కోటా మొదటిసారి గెలవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సమస్యల పరిష్కారంలో శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
మేనేజ్‌మెంట్ కోటా ఒకసారి గెలిచేందుకే ఉపయోగపడుతుందని... ఆ తర్వాత సత్తా ఉంటేనే రాణించగలమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు... శ్రీపాదరావు వారసత్వాన్ని తీసుకొని... స్వయంకృషితో ఎదిగారన్నారు. తన తండ్రి నుంచి స్ఫూర్తి పొందే శ్రీధర్ బాబు శాసన సభ వ్యవహారాలు నిర్వహిస్తున్నారని కితాబునిచ్చారు.