రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని వెల్లడి
  • టీఎస్ పీఎస్ సీ ని ప్రక్షాళన చేశామని స్పష్టీకరణ
  • ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటన
దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని తెలిపారు. అస్తవ్యస్తంగా మారిన టీఎస్ పీఎస్ సీ ని ప్రక్షాళన చేశామని చెప్పారు. కేవలం 3 నెలల్లోనే 25 వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు.


More Telugu News