రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... లోక్ సభ అభ్యర్థుల జాబితాపై చర్చ

  • రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రేపు తొలి జాబితా విడుదల చేసే అవకాశం
  • రాష్ట్రంలోని పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధిష్ఠానం రేపు పూర్తి చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం రేపే 10 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశముంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించవచ్చు.

అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థులపై చర్చ జరగనుంది. రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.


More Telugu News