సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి
- కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన బలరాం నాయక్
- నిన్న మహబూబాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధిష్ఠానం
- ముఖ్యమంత్రిని కలిసిన చల్లా వంశీచంద్ రెడ్డి
మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ శనివారం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధిష్ఠానం నిన్న నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌కు అవకాశం ఇచ్చింది. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన బలరాం... 2014, 2019 ఓడిపోయారు.
మహబూబ్ నగర్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వంశీచంద్ రెడ్డి 2014లో కాంగ్రెస్ తరఫున కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. 2019 మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి ఇదే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తొలి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులు అందరూ కలిసి మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి, సురేశ్ షేట్కార్ తదితరులు ఉన్నారు.