తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
- లోక్ సభ బరిలో తమిళిసై!
- పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రిజైన్
- తమిళనాడు నుంచి లోక్ సభకు పోటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. సోమవారం ఉదయం తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళిసై రాజీనామా సంచలనంగా మారింది. లోక్ సభ ఎన్నికల బరిలో తమిళిసై నిలబడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
అయితే, అలాంటిదేమీ లేదని గతంలో స్పష్టం చేసిన తమిళిసై.. ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేయడంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. తమిళనాడు నుంచి తమిళిసై లోక్ సభ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. తమిళిసై నాడార్ సామాజిక వర్గానికి చెందిన లీడర్.. దీంతో నాడార్ ల ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి తమిళిసై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.