విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- బాత్‌రూంలో ఆత్మహత్యకు సిద్దమైన వ్యక్తిని గుర్తించిన విమాన సిబ్బంది
- పరిస్థితిని గుర్తించి ఫ్లైట్‌ని అత్యవసరంగా దించిన వైనం
- బ్యాంకాక్ నుంచి లండన్ వస్తున్న విమానం
బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న ఇవా ఎయిర్ ఫ్లైట్‌లో (బీఆర్67) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం బాత్‌రూంలో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రయాణ సమయంలో ప్యాసింజర్లలో ఒకరు ఎంతసేపు అయినా బాత్‌రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానించారు. ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. మానసిక పరిస్థితిని గుర్తించి విమానాన్ని లండన్ హిత్రూ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని ఇవా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల సమయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ఫ్లైట్ ల్యాండింగ్ సమయానికంటే ముందే వైద్య సిబ్బంది అక్కడి సిద్ధంగా ఉన్నారని, వెంటనే ఆసుపత్రికి తరలించారని పేర్కొంది. కాగా ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు వెల్లడికాలేదు. అయితే ప్రయాణికుల్లో ఒక డాక్టర్ బాధిత వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించినట్టు ఇవా ఎయిర్‌లైన్స్ తెలిపింది.