జగన్.. తొలుత మీ చెల్లెళ్లకు సమాధానం చెప్పు: దేవినేని ఉమ
- బాబాయి హత్యను గుండెపోటుగా మార్చాలనుకుంటే గొడ్డలిపోటుగా బయటపడిందని ఉమ ఎద్దేవా
- ఐదేళ్లుగా కేసును నీరు గార్చారని ఆగ్రహం
- బాబాయిని చంపిందెవరో దేవుడికే కాకుండా ప్రజలకు కూడా తెలుసన్న టీడీపీ నేత
బాబాయి హత్యను గుండెపోటుగా మార్చాలనుకుంటే అది కాస్తా గొడ్డలిపోటుగా బయటపడిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా కేసును నీరుగార్చారని, నిందితుల అరెస్టును సైతం వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకున్నారని ఆరోపించారు.
బాబాయిని చంపిందెవరో దేవుడికే కాకుండా ప్రజలకు కూడా తెలుసని, జగన్ పాలనలో న్యాయం జరగదని స్పష్టం చేశారు. నిందితులను పక్కనపెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, హంతకులకు, జగన్‌కు ఓట్లు వేయవద్దంటున్న చెల్లెళ్లకు జగన్ సమాధానం చెప్పాలని ఉమ నిలదీస్తూ.. వైఎస్ జగన్‌కు వివేకా కుమార్తె డాక్టర్ సునీత సంధించిన ప్రశ్నల వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు.