రాష్ట్రంలోని మొత్తం లోక్ సభ సీట్లను ఒకే పార్టీ గెలుచుకోవడం కర్ణాటక చరిత్రలో ఒకేసారి జరిగింది!

  • 1951 నుంచి ఎలక్టోరల్ డేటా తీస్తే ఒకసారి మాత్రమే 28 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్
  • 1971లో ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కర్ణాటకలో మొత్తం సీట్లు గెలిచిన కాంగ్రెస్
  • గరీబీ హఠావో నినాదంతో అద్భుత విజయం సాధించిన ఇందిరా గాంధీ
కర్ణాటకలో ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే 1971లో మొత్తం 28 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు ఈ ఘనత మరే పార్టీ దక్కించుకోలేకపోయింది. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలను తామే గెలుచుకుంటామని బీజేపీ-జేడీఎస్ కూటమి ధీమాగా చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో 1951 నుంచి ఎలక్టోరల్ డేటా తీస్తే 1971లో మాత్రమే ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ దీనిని సాధించింది. 

అప్పుడు తమిళనాడుకు చెందిన కామరాజ్, కర్ణాటకకు చెందిన నిజలింగప్ప వంటి ఉద్దండులు సిండికేట్ గా ఏర్పడి కాంగ్రెస్ కు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ మొత్తం సీట్లు గెలిచింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1969లోనే బెంగళూరులోని లాల్ బాగ్‌లో వీరంతా సమావేశమయ్యారు. కానీ 'గరీబీ హఠావో' నినాదంతో ఇందిర దేశమంతా అద్భుత విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో ఆమె అక్రమాలకు పాల్పడ్డారని ఆ తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ (2014లో రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజన జరిగింది), తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలోలా కర్ణాటకలో జేడీఎస్ జాతీయ పార్టీలను దీటుగా ఎదుర్కోలేకపోతోంది.


More Telugu News