నల్గొండ మున్సిపాలిటీ ట్యాంకులో పడి 30 కోతుల మృతి ఘటనపై ఘాటుగా స్పందించిన కేటీఆర్!
- నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో ఘటన
- ఈ ఘటనపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్
- ప్రజల ఆరోగ్యం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాలన ఇలా ఉందన్న బీఆర్ఎస్ నేత
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో ఓ నీటి ట్యాంకులో 30 వానరాలు పడి మృతి చెందిన విషయాన్ని అధికారులు బుధవారం గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే అవి మరణించినట్టు సమాచారం. కోతుల కళేబరాలను మున్సిపల్ సిబ్బంది వెలికితీశారు. అయితే, ఇవే నీటిని గత కొన్ని రోజులుగా చుట్టుపక్కల నివసించే జనాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ ఘటనపై ఎక్స్ (ట్విటర్) వేదికగా బీఆర్ ఎస్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు.
"తెలంగాణ మున్సిపల్ శాఖ పని తీరు సిగ్గుచేటు. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టం అర్థమవుతోంది. ప్రజల ఆరోగ్యం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాలన ఇలా దుర్భరంగా మారింది" అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.