తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థి బలవన్మరణం!
- ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ విద్యార్థి దేవపంగు వివేక్
- నాదర్ గుల్‌లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటన
- టీచర్ వేధింపులే కారణమని అనుమానం
సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని కూకట్ పల్లికి చెందిన 14 ఏళ్ల దేవపంగు వివేక్‌గా పోలీసులు గుర్తించారు. నాదర్ గుల్‌లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వివేక్ వసతి గృహంలోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఓ టీచర్ కొట్టడంతో మనస్తాపం చెంది వివేక్ బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.