ఈపీఎఫ్ఓ వేతన పరిమితి రూ.21 వేలకు పెంచే యోచనలో కేంద్రం

  • ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచన
  • ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్న గరిష్ఠ వేతన పరిమితి
  • ఈ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచే యోచనలో కేంద్రం
ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉంది. ఈ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచే యోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి పెంపుకు సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగం పైనా భారం పడుతుంది. అయితే ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది.


More Telugu News