విద్యుత్ తీగలకు చిక్కుకున్న ఇరాన్ డ్రోన్.. వైరల్ వీడియోలో నిజమెంత?
- ఇజ్రాయెల్ పైకి 300 లకు పైగా డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్
- వాటిలో ఒకటి విద్యుత్ తీగలకు చిక్కుకుందంటూ ప్రచారం
- ఫ్యాక్ట్ చెక్ లో ఆ డ్రోన్ ఇరాన్ ప్రయోగించలేదని తేలిన వైనం
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు మొదలయ్యాయి. తొలిసారి ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పై దాడి చేసింది. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న జెరూసలెంపైకి ఏకంగా మూడు వందలకు పైగా డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. అయితే, అమెరికాతో పాటు, తన రక్షణ వ్యవస్థ సాయంతో వాటిలో దాదాపు 99 శాతాన్ని ఇజ్రాయెల్ కూల్చేసింది. ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటిలోకి ఓ ఫొటో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. విద్యుత్ తీగలకు చిక్కుకున్న ఓ డ్రోన్ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ లక్ష్యం చేరలేక మధ్యలోనే చతికిలపడి ఇదిగో ఇలా విద్యుత్ తీగలకు చిక్కుకుందని ఆ ఫొటో కింద కామెంట్ కనిపిస్తోంది. అయితే, ఈ డ్రోన్ నిజంగా ఇరాన్ ప్రయోగించిందేనా.. ఫొటోలో కనిపించే ప్రాంతం ఇరాన్ భూభాగమేనా అని కొంతమంది ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అది ఇరాన్ డ్రోన్ కాదని తేలింది. సిరియాలోని హసాఖా అనే ప్రాంతంలో తీసిన ఫొటో అని గుర్తించారు. ఆ డ్రోన్ ఏ దేశానిది, ఎవరు ప్రయోగించారనే వివరాలు తెలియలేదు.. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచే అది సోషల్ మీడియాలో ఉందని తేలింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది ఈ నెల 13న.. సో, ఈ డ్రోన్ ఇరాన్ ప్రయోగించింది కాదని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు స్పష్టం చేశారు.