హామీలపై నిలదీస్తే రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారు: హరీశ్ రావు

  • ముఖ్యమంత్రి పదవిలో ఉండి స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదని విమర్శ
  • పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని రాహుల్ గాంధీ చెప్పారన్న హరీశ్ రావు
  • కానీ కాంగ్రెస్ ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోందని ఆగ్రహం
హామీలపై నిలదీస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదన్నారు. సింగూరు జలాలు మెదక్‌కు దక్కేలా చేసింది కేసీఆరే అన్నారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని రాహుల్ గాంధీ అంటున్నారని.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీనే జీతాలు ఇస్తున్నామ‌ని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారని... మరి ఒక‌టో తేదీనే వేతనాలిస్తే గురుకులాల్లో ప‌ని చేస్తున్న కంప్యూట‌ర్ టీచ‌ర్ల‌కు మూడు నెల‌లుగా జీతాలు ఎందుకు అంద‌డం లేద‌ు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడపదాటడం లేద‌న్నారు. వేతనాలు సరిగా లేక ఐసీటీ కంప్యూటర్ టీచర్లు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారన్నారు.


More Telugu News