బీ ఫారం అందుకుని చంద్రబాబుకు పాదాభివందనం చేసిన నారా లోకేశ్

  • చంద్రబాబు నివాసంలో టీడీపీ అభ్యర్థుల కోలాహలం
  • అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత
  • అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఇవాళ పార్టీ అభ్యర్థులతో కళకళలాడింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు ఇవాళ తన నివాసంలో బీ ఫారాలు అందించారు. అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. 

బీ ఫారాలు అందుకున్న వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ, ఇటీవలే టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు తదితరులు ఉన్నారు. 

కాగా, బీ ఫారం అందుకున్న లోకేశ్... చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తనయుడికి చంద్రబాబు ఆశీస్సులు అందించారు.


More Telugu News