నేను మొద‌టి నుంచి మ‌హిళా ప‌క్ష‌పాతిని: చంద్ర‌బాబు

  • శ్రీకాకుళంలో మ‌హిళ‌ల‌తో టీడీపీ అధినేత‌ ముఖాముఖి కార్య‌క్ర‌మం
  • టీడీపీ మ‌హిళ‌ల‌కు పుట్టినిల్లు అని పేర్కొన్న చంద్ర‌బాబు
  • ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడిన జ‌ల‌గ‌.. సైకో జ‌గ‌న్ అంటూ ధ్వ‌జం
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు శ్రీకాకుళంలో మ‌హిళ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. టీడీపీ మ‌హిళ‌ల‌కు పుట్టినిల్లు అని అన్నారు. తాను మొద‌టి నుంచి మ‌హిళా ప‌క్ష‌పాతిని అని పేర్కొన్నారు. మీ కుటుంబాల‌కు పెద్ద‌కొడుకులా సేవ చేస్తాన‌ని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డారని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడిన జ‌ల‌గ‌.. సైకో జ‌గ‌న్ అని ధ్వ‌జ‌మెత్తారు. 'నిత్యావ‌స‌రాలు స‌హా అన్నింటి ధ‌ర‌లు పెంచేశారు. మీ జీవితాల‌ను త‌లకిందులు చేసిన దద్ద‌మ్మ ప్ర‌భుత్వ‌మిది' అని చంద్ర‌బాబు వైసీపీ స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు.


More Telugu News